కర్నూలు జిల్లా ఆదోని పట్టణం భాహర్ పేట లో దారుణం చోటుచేసుకుంది. మురికి కాలువ లో సెంట్రింగ్ కార్మికుడు మహమ్మద్ గౌస్ మృతదేహం లభ్యం అయ్యింది.
సిఐ రామలింగమయ్యా తెలిపిన వివరాలను ఇలా ఉన్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కాలువ నుండి బయటకి తీసి అక్కడే పడి ఉన్న కూరగాయలు కోసే కత్తిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రాథమిక విచారణలో గౌస్ సెన్ట్రింగ్ కార్మికుడు గా పని చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడని. గత ఏడాది తండ్రి మృతి చెందగా ఇటీవల కొంతకాలంగా మతి స్థిమితం స్థిరంగా ఉండడటం లేదని యదావిధిగా ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయటికి వెళ్లాడని, ఘటనా స్థలంలో లభ్యమైన కత్తి కూడా ఇంట్లోదని కుటుంబ సభ్యులు తెలిపారని , ఈ ఘటనలో పూర్తి విచారణ చేసి ఇది ఆత్మహత్యనా లేక హత్యనా తెలుస్తామని అన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించమని సిఐ తెలిపారు.