కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ విలేకరులు ఇచ్చిన ప్రకటనలో బసాపురం రిజర్వాయర్ నుండి పంపింగ్ ద్వారా రామజల ఫిల్టరేషన్ ప్లాంటుకు వచ్చే 600 mm dia CI పైప్ లైన్ మీద భారీ చెట్టు పడి పైప్ లైన్ పూర్తిగా దెబ్బ తినడంతో ఆదోని మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పైప్ లైన్ మరమ్మత్తు మరియు పునరుద్ధణ పనులు చేస్తున్నారని తెలిపారు. అందువల్ల ఆదోని పట్టణ ప్రజలు రామజల ఫిల్టరేషన్ ప్లాంట్ నుండి త్రాగు నీరు సరఫరా అందించే వార్డులలో 01 వ వార్డ్ నుండి 17 వ వార్డ్ వరకు అదేవిధముగా 27th, 28, 29, 30, 31″, 33, 40, 41 మరియు 42nd, వ వార్డు ప్రజలకు త్రాగు నీరు అందించే సమయము కన్నా 24 గంటల నుండి 36 గంటల సమయం పడుతుందని తెలిపారు. త్వరగా పనులు పూర్తిచేసే త్రాగునీ అందిస్తామని మున్సిపల్ కమిషనర్ ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పైప్లైన్ ను పరిశీలిస్తున్న మున్సిపల్ సిబ్బంది
చెట్టును తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *