ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సృజన బదిలీ
కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా పి రంజిత్ బాషా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ గా ఉన్న పి రంజిత్ బాషాను కర్నూలు జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ గా ఉన్న గుమ్మల్ల సృజనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు.