కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వి రైల్వే స్టేషన్ సమీపంలో లైన్ KM NO: 495/33 వద్ద వాల్మీకి నగర్కు చెందిన బోయ వీరేశ్ (38) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. వాల్మీకి నగర్కు చెందిన వీరేశ్ (38) తండ్రి బోయ కిష్టప్ప అతడు మద్యానికి బానిసై ఇంట్లో గొడవ పడుతోండగా, భార్య రాజమ్మ ఎన్నో సార్లు బ్రతిమాలిన మారనందున భార్య పుట్టింటికి వ్వెళ్లిపోవడం తో విరేశ్ మద్యానికి బానిసై తన మూడో పెళ్ళాము కూడా కాపురానికి రాదేమో అని జీవితము పై వీరక్తి చెంది శనివారం 24వ తేది ఆదోని – ఇస్వి RSS ల మద్య ఎదో ఒక గుర్తు తెలియని రైలు లేదా గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకొని రక్తగాయలతో చనిపొయినాడు అని ఎస్ఐ రామస్వామి వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని ఎస్ఐ రామస్వామి తెలిపారు.