కర్నూలు జిల్లా ఆదోని వినూత్న రీతిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నిరసన తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులలో మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన చేస్తూ ప్రజలకు పరిస్థితులను వివరించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమె నడపాలని డబ్బులు లేవంటే బిక్షాటన చేసి సిగ్గులేని ప్రభుత్వానికి మేము ఇస్తామని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు
తెలిపారు.

మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

1. రంగప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ
రాజధాని కోసం కూటమి ప్రభుత్వం 2100 కోట్ల ఖర్చు చేస్తుంది అదే పేద మధ్యతరగతి వారికి ప్రాణదాత అయిన మెడికల్ కాలేజ్ ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి సిగ్గు రావడానికె ఈ బిక్షం ఎత్తుతున్నామని అన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రతి ఇంటికి ప్రతి చోటికి వెళ్లి బిక్షాటన చేస్తామని ఆ వచ్చిన డబ్బులు ప్రభుత్వానికి పంపిస్తాం అప్పుడైనా నిర్మాణం పూర్తి చేయండి సిగ్గులేని సీఎం రాష్ట్రాన్ని బిక్షం ఎత్తుకునే పరిస్థితిని తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు

2. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందేలా 17 మెడికల్ కాలేజీలో ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేసి డబ్బులు లేవని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం సరైన పద్ధతి కాదని కావాలంటే బిక్షాటన చేసి డబ్బులు ఇస్తామని అప్పుడైనా ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నడపాలని కోరారు.

మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు
మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *