News
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
■ ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 40 కి పైగా కేసులు ఉన్న అంతర్రాష్ట్ర పశువులదొంగ ముఠా అరెస్ట్..
■ సుమారు 1 కోటి 50 లక్షల విలువ చేసే పశువుల స్వాధీనం..
■ మారున ఆయుధాలు ఒక కారు రెండు బొలెరో వాహనాలు 14 సెల్ ఫోన్లు స్వాధీనం..

కర్నూలు జిల్లా ఆదోని లో అంతర్రాష్ట్ర పశువుల దొంగలు ముఠా అయిన 16 మంది ముద్దాయులను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా 9 మంది పరారీలో ఉన్నరు వారివద్ద నుండి సుమారు 1 కోటి 50 లక్షల విలువ కలిగిన పశువులు (మేకలు & పందులు) మరియు 02 బోలెరో క్యాంపర్ వాహనాలు ఒక ఫోర్డ్ కారు, మారణాయుధాలు, 14 సెల్ ఫోన్, ఖాళీ కూల్ డ్రింక్స్ బాటిల్లు, కారంపొడి ప్యాకెట్లు, రాళ్లు స్వాదీనం చేసుకున్నారు.

డీఎస్పీ హేమలత తెలిపిన వివరాల మేరకు ఆదోనిలో పశువుల దొంగతనాల 13 కేసులు నమోదు కాగా అందులో మొత్తం 25 మందికి పైగా ముద్ధాయులు ఉన్నారని వారిలో 16 మందిని అరెస్టు చేశామని తెలిపారు మిగిలిన వారికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గావిస్తున్నామని తెలిపారు. అరెస్ట్ అయిన వారిపై కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో వీరిపై మొత్తం 40కి పైగా జేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. వీరు దొంగతనానికి రాత్రి ఒకటి నుంచి మూడు ప్రాంతంలో చేస్తారని ఆ సమయంలో ఎవరు అడ్డు వచ్చినా మారున ఆయుధాలతో రాడ్లతో కత్తులతో ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్లతో కళ్ళలో కారం కొట్టి నరరూప రాక్షసుల దాడులు చేస్తారని తెలిపారు. అంతేకాక వారి వాహనాలతో గుద్ధి వెళ్లిపోతారని వీరిపై అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయని తెలిపారు. వీరంతా కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప గ్రామానికి చెందిన వారిని తెలిపారు.

ఆదోని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్ స్టేషన్ సిబ్బంది రాబడిన సమాచారము మేరకు 15.09 2925 వ తేదీన సాయంత్రం 04:00 గంటలకు ఆదోని నుంచి మారవరం కు పోషి రోడ్ లో గల భారత్ గ్యాస్ గోడౌస్ ఎదురుగా పాడుబడిన శ్రీనివాస ట్రేడింగ్ & జీన్సింగ్ ఫ్యాక్టరీ అపరణము లో 16 మందిని అదుపులోనికి తీసుకుని విచారించగా

వారి నుంచి 1,49,33,000/- (అక్షరాలా ఒక కోటి సలబై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల విలువ రూపాయలు) విలువ చేసే 542 పశువులను, రెండు బోలెరో వాహనాలను, ఒక కారును, వివిధ రకాలైన మారణాయుధాలను, కారం పొడిని మరియు 16 ప్లాస్టిక్ కారేట్ లలో ఉన్న ఖాళీ రూల్ డ్రి బాటిల్లను స్వాధీన పరచుకుని 16 మంది ముద్దాయులను రిమైండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు. పై తెలిపిన ముద్దాములు, సశువుల దొంగతనము చేసే క్రమం లో బాదితులు కానీ, పోలీసులు కానీ పట్టుకునే ప్రయత్నం చేసిన వారిపై క్రూరంగా బాధితులను, అడ్డు వచ్చిన పోలీసుల పై కారం పొడి చల్లి కట్టెలు, రాళ్ళు సీసాల తో, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు.


గతం లో కూడా తెలంగాలు రాష్ట్రం లో జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలలో మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం జిల్లాలో పలు పోలీసు స్టేషన్ పరిధి లో అనేక చోట్ల రబరి, డకాయిటీ లకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో రెండు వారాల కిందట యెమ్మిగనూర్ మరియు ఆదోని లో అడ్డొచ్చిన బాధితులను తలు మరియు చేతులు విరగగొట్టి పోలీసులపై కూడా దాడి చేసినట్లు తెలిపారు. వీరిపై మొత్తం 40కి పైగా జేసులు రిజిస్టర్ రిజిస్టర్ అయినట్లు తెలిపారు. ఈ కేసులలో మొత్తం 25 మందికి పైగా ముద్ధాయులు ఉందగా వారిలో 16 మండి ప్రస్తుతము ఆరెస్టు చేశామని వీరిలో ఒకరి మీద కోడుమూరు పరిధిలో ఒక మర్జర్ కేసు మరియు ఒకరి మీద యెమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో దొమ్మి, హత్యా ప్రయత్నం కేసులు నమోదు అయ్యాయని తెలిపారు మిగిలిన 9 మంది ముదాయుల కొరకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి శ్రీరామ్ ని వారి సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు

ముద్దాయుల నుంచి స్వాధీనపరచుకున్న వాటి వివరాలు..
1. అక్షరాలా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల విలువ రూపాయలు (Rs. 1,49,33,000/-) విలువ చేసే 542 పశువులు
2. KA36B 9672 మరియు KA3689672 రిజిస్ట్రేషన్ సంబర్ గల రెండు Bolero వాహనాలు
3. AP16 DP5708 రిజిస్ట్రేషన్ నెంబర్ గల ఒక కారు..
4. వివిద రకాల మారణాయుధాలు..
5. 16 ప్లాస్టిక్ కారేట్ లలో ఉన్న ఖాళీ కూల్ డ్రింక్స్ బాబిళ్లు..
6. కారం పొడి ప్యాకెట్లు..
అదుపులోనికి తీసుకోబడిన ముద్దాయి ల వివరాలు:
1. యెరుకల మజ్జ (ముత్తు), సోమ్లాపూర్ గ్రామం, సింధనూర్ తాలూకా, రాయచూర్ జిల్లా, కర్ణాటక.
2. యెరుకలి బజంత్రీ కృష్ణ శ్రీ బాబా, సిందనూర్ టౌస్, రాయమార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రము.
3. ఐజంల సిద్దు @ యరుకలి సిద్దు, సింధనూర్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం,

4. బజంత్రి మల్లికార్జున @ ఎరుకలి మల్లికార్జున @ మల్లి, సింధనూర్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
5. యెరుకలి చంద్ర (@ చమ్మక్ చంద్ర, BC కాలనీ, హోళగుంధ గ్రామం & మండలం, కర్నూలు జిల్లా, ప్రస్తుత నివాసము సచివాలయం సమీపంలో, చిన్న హుల్తీ గ్రామం, పత్రికొండ మండలం, కర్నూలు జిల్లా.
6. యెరుకల హుసలప్ప @ హుసల, సిందనూర్ టౌస్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం,
7 యెరుకల రంగన్న, శక్తిగుడి, ఎద్దుల మార్కెట్ దగ్గర, యెమ్మిగనూరు టౌన్, కర్నూలు జిల్లా.
8. యెరుకలి నాగరాజు @ సిరిగేరి నాగరాజు @ రుప్ప, సిరిగేరి గ్రామం, సిరుగుప్ప తాలూకా, బళ్లారి జిల్లా, కర్ణాటక రాష్ట్రం
9. విజంత్రీ హనుమంతు @ ఎరుకలి హనుమంతు @ గుడ్డిలప్ప, సిందనూర్ టౌన్, రాయమార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం
10. యెరుకలి అర్జున్ @ కోలగల్లు అర్జున్, కోలగల్లు గ్రామం, బళ్లారి తాలూకా (@) జిల్లా, కర్ణాటక రాష్ట్రం
11. యెరుకలి మహేష్ మదిన గ్రామం, కొతాళం మండలం, కర్నూలు జిల్లా,
12 బంద్ శంకర్ కోట్, జనతా కాలనీ, సిండమార్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం
13. వాల్మీకి వెంకటేష్ @ వెంకి, హనుమంత క్యాంపు, సిందనూర్ తాలూడా రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం..
14. చెరుకలి ఆంజనేయులు @ మిగుదొడ్డి అంజి, సంగుదొడ్డి గ్రాము, అయి ముండలు, గన్నాల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
15. ఎరుకలి సందేశ్ @ గొంటు, అక్కలకోట గ్రామము, సిరుగుప్ప తాలూకా, బళ్ళారి జిల్లా, కర్నాటక రాష్ట్రము.
26. ఎరుకలి రవిచంద్ర డవి, మంకేశ్వరి గ్రామము, ముంద్రాజయం మండలం కర్నూల్ జిల్లా
పరాప్ లో ఉన్న ముద్దాయులు..
1. కృష్ణ, సింధనూరు టౌన్
2. సుంకన్న, కందనతి, యెమ్మిగనూరు,
3. భీమ, యెమ్మిగనూరు.
4 మారేష్, చిన్న హుల్తి
5. అంజి, హోలగుంద
6. రమేషు తురుకల్ డోన, రాయచూరు జిల్లా
7. కొరగల్ మరేష్ @ గుడ్ల మరేష్
3. యెమ్మిగనూడు పెద్ద నాగరాజు
9. చిన్న నాగరాజు @ బాతు
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
