ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ లో ప్రియుడు గురు ఈశ్వర్ ఇంటి ముందు ప్రియురాలు చందన  ఆందోళనకు కూర్చోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి బెంగళూరులో తన తల్లిదండ్రుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొని మోసం చేసి ప్రేమికుడు గురు పారిపోయాడంటు యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రియుడితో సెల్ఫీ దిగిన పాత ఫోటో


అమ్మాయి చందన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మైసూరుకు చెందిన యువతి చందన మంజునాథ , ఆదోని అబ్బాయి గురు ఈశ్వర్ ప్రసాద్  బెంగుళూరు లో ఒక ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తు ప్రేమలో పడ్డారు. ప్రేమవ్యవహారం పెళ్లివరకు వచ్చి బెంగళూరులో రెండు కుటుంబాల మధ్యనే నిశ్చితార్థం చేసుకున్నారు. చివరకు కట్న కానుకల విషయంలో గురు ఈశ్వర్ తల్లితండ్రులు పట్టుబట్టడంతో ఈశ్వర్  ఆఫీస్ రాకుండా ముఖం చాటేసి ఆదోని చేరుకున్నడు. విషయం తెలుసుకుని వారం రోజుల క్రితం చందన మంజునాథ్ ఆదోనికి రావడంతో ప్రియుడు ఈశ్వర్ అతని తల్లి తండ్రులు నాగరాజు, నాగవేణి ఇల్లు వదిలి వెళ్లిపోయారని చందన తెలిపింది. ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయాలని ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్టు తెలిపింది.

ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top