కర్నూలు జిల్లా ఆదోనిలో తేదీ 14.09.2024 శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా లో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. రెండవ శనివారం నిర్వహణ కారణంగా 11 కెవి శక్తి గుడి ఫీడర్ మరియు 11 కెవి హాస్పిటల్ ఫీడర్ పరిధిలో ఉన్నా గణేష్ సర్కిల్, హవానాపేట స్కూల్, బుడ్డేకల్, శక్తిగుడి, బావాజీపేట, శ్రీనివాస భవన్ ఏరియా, మేదర్ గెరి, ఎల్బి వీధి, సంతపేట ప్రాంతలకు విద్యుత్ సరఫర ఉండదు. కావున విద్యుత్ వినియోగదారులకు సహకరించాలని అధికారులు తెలిపారు అదేవిధంగా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు రామ్ జల్ల, హనుమాన్ నగర్, ఇండోర్ మరియు అరేకల్, సంతకుడ్లుర్ గ్రామాల్లో విద్యుత్తు సరఫరా లో అంతరాయం ఉంటుందని. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు బైపాస్, 11 గంటల నుండి 12 గంటల వరకు కాల్లుబావిలో విద్యుత్తు సరఫరా లో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.