కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన హుసేని (35 సం.) ఫినాయిల్ తాగిఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన బంధువులు హుటా హుటిన రాత్రి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి పపమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్య తన మాట వినలేదని భార్యతో గొడవపడి రూమ్ లోపలికి వెళ్లి తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్న ఫినాయిల్ ను తన కొడుకు హుసేని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపింది. గమనించిన కుటుంబ సభ్యులు రాత్రి ఆదోని ప్రభుత్వాసుపత్రి తరలించామని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హుసేని
తల్లి పపమ్మ మాట్లాడిన వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *