కర్నూలు జిల్లా ఆదోనిలో శిథిలవస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ ను పునర్హ నిర్మించాలని ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యులు నసరుద్దీన్ పటేల్ కోరారు. సోమవారం ప్రజా వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్కు ఈ విషయంపై వినతిపత్రం అందజేశరు.
నసరుద్దీన్ పటేల్ మాట్లాడుతూ 1987లో రాయచోటి రామయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ ను డెమోలిష్ చేసి, అప్పటి మాజీ సీఎం ఎన్టీ రామారావు హాయంలో పునర్హ నిర్మించారన్నారు. ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, పునర్హ నిర్మించాలని ప్రభుత్వాన్ని
కోరారు.