సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల20 వేలు ఆర్థిక సహాయం

ఆరోగ్యశ్రీలో లేక వైద్యం కోసం ఖర్చుపెట్టి ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల 20 వేల రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందజేశారు. కార్వాన్ పేట్ వీధి కి చెందిన నరసింహులు 4 లక్షల 20 వేల రూపాయలు, బోయగిరి వీధి కి చెందిన వి. చంద్ర లివర్ చడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందినడు అతని కుటుంబానికి 3 లక్షల 20 వేల రూపాయలు, మరాఠీ గేరికి చెందిన చాంద్ బాషా అనే వ్యక్తి 1 లక్ష 20 వేలు, పెద్ద హరివాణం గ్రామానికి చెందిన బెంజి గర్జన్నకు 20వేల రూపాయలు, పెద్ద తుంబలం గ్రామానికి చెందిన గంజాల రంగమ్మ కు 1 లక్ష 40 వేల రూపాయలు వైద్య ఖర్చులకు గా సీఎం రిలీఫ్ ద్వారా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెక్కులను అందజేశారు.

నరసింహులు కు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే
చంద్ర కుటుంబానికి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే
చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version