హెచ్ పి గ్యాస్ సిలిండర్లు సీజ్

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివన గ్రామంలో కర్ణాటక నుంచి హెచ్.పీ గ్యాస్ సిలిండర్లను తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకొని 50 సిలిండర్లను సీజ్ చేశారు. కర్ణాటక నుంచి తెచ్చి గ్యాస్ సిలిండర్లను డిస్ట్రిబ్యూట్ చేయొద్దని ఎన్నిసార్లు హెచ్చరించిన వినకపోవడంతో రెవెన్యూ అధికారులకు పోలీసులకు డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 10 02 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 86700-001 గ్రాములు సుమారు రూ. 8670-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 8028-001 గ్రాములు సుమారు రూ. 8028-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 960-00

ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు

తేదీ 10-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7595/- రూపాయలు కనిష్ట ధర ₹. 5000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5724/- రూపాయలు కనిష్ట ధర ₹. 3059/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5660/- రూపాయలు కనిష్ట ధర ₹.3400/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 10-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7199/- రూపాయలు కనిష్ట ధర ₹. 4699/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6327/- రూపాయలు కనిష్ట ధర ₹. 3512/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5796/- రూపాయలు కనిష్ట ధర ₹.5170/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5151/- రూపాయలు కనిష్ట ధర ₹.5151/- రూపాయలు పలికింది. … Read more

ఎమ్మిగనూరులో జాబ్ మేళా.. జిల్లా ఉపాధి అధికారి

ఎమ్మిగనూరులో జాబ్ మేళా.. జిల్లా ఉపాధి అధికారికర్నూలు జిల్లా నైపుణ్య మరియు శిక్షణ శాఖా వారి అద్వర్యంలో 12.11.2024 మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు  ప్రభుత్వ జూనియర్ కళాశాల, వైఎస్ఆర్ సర్కిల్, ఎమ్మిగనూరు లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి పి.దీప్తి  ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్ధులు మీ విద్యార్హతకు సంబందించిన ధ్రువ పత్రాలు, ఫొటోస్, తీసుకుని రావాలని తెలిపారు. మహిళా మరియు పురుష అభ్యర్థులు ఉద్యోగ మేళా లో పాల్గొని … Read more

వేరు వేరు స్కూటర్ ప్రమాదాలలో ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా: వేరు వేరు  రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.ఆదోని మండలం సదాపురం గ్రామం వద్ద ఉదయం అంజి (50) అనే వ్యక్తిని బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆదోని జిజిహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అంజి మృతి చెందాడు.కోసిగి సమీపంలో అదే గ్రామానికి చెందిన ఆంజనేయ (20 సం) అనే యువకుడు స్కూటర్ అదుపుతప్పి క్రింద పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ లో ఆదోని ప్రభుత్వ … Read more

బన్ని ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఆదోని సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవర గట్టు లో శనివారం జరిగే శ్రీ మాల మలేశ్వర స్వామి బన్ని ఉత్సవాల ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించరు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.  పత్తికొండ ఆర్డీవో, డి ఎస్ పి మరియు సంబంధిత అధికారులతో కలసి పార్కింగ్, సి.సి. ఫుటేజ్ , బారి కెడ్లు, శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయవలసిన స్థల ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం అరికెర గ్రామంలో సబ్ కలెక్టర్ మౌర్య … Read more

బాలింత ఉరి వేసుకొని ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం కదితోట గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గీతమ్మ అనే అయిదు నెలల బాలింత ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాలుపడింది. పోలీసులకు తెలిపిన వివరాల మేరకు గీతమ్మ కాన్పు  కోసం పుట్టింటికి వచ్చి అనారోగ్యం కారణంగా భర్తకు ఫోన్ చేసిన ఎత్తకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపినట్ల ఎస్ఐ తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన తెలిపారు.

వ్యాపార దిగ్గజం రతన్‌ టాటా కన్నుమూత

వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రతన్‌ టాటా మరణించిన విషయాన్ని హర్ష గొయెంకా ఎక్స్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ … Read more

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8239 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 10-09-24 పత్తి అత్యధికంగా ₹. 8239/- రూపాయలు కనిష్ట ధర ₹. 4319/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7033/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5593/- రూపాయలు కనిష్ట ధర ₹.4800/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- … Read more