News
కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖల కేటాయింపు…
- కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు
- కింజారపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ
- బండి సంజయ్ – హోం శాఖ సహాయ మంత్రి
- పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి
- శ్రీనివాస వర్మ – స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి
హోంమంత్రి- అమిత్‌షా
రక్షణమంత్రి-రాజ్‌నాథ్ సింగ్
విదేశాంగమంత్రి-జై శంకర్
రవాణాశాఖ-నితిన్ గడ్కరీ
ఆర్థికమంత్రి-నిర్మలాసీతారామన్
వైద్యశాఖ- జేపీ నడ్డా
విద్యాశాఖ- ధర్మేంద్ర ప్రధాన్
వాణిజ్యం- పీయూష్ గోయల్
పార్లమెంట్ వ్యవహారాలు- కిరణ్ రిజిజు
పౌర విమానయానశాఖ-రామ్మోహన్ నాయుడు
జలశక్తి- సీఆర్ పాటిల్
క్రీడలు- చిరాగ్ పాశ్వన్
ఓడరేవులు, షిప్పింగ్- శర్బానంద సోనోవాల్
మహిళాశిశు సంక్షేమం- అన్నపూర్ణాదేవి
మైనార్టీ శాఖ- రన్వీత్‌సింగ్ బిట్టూ
కార్మికశాఖ, క్రీడలు- మన్‌సుఖ్ మాండవీయ
పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం- మనోహర్‌లాల్ ఖట్టర్
పెట్రోలియంశాఖ- హర్దీప్ సింగ్ పూరి
రైల్వే, సమాచార & ప్రసారశాఖ- అశ్విని వైష్ణవ్
చిన్న, మధ్యతరహా పరిశ్రమలు- జితిన్ రామ్ మాంఝీ
వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ- శివరాజ్‌సింగ్ చౌహాన్
టూరిజం, సాంస్కృతిక శాఖ- గజేంద్రసింగ్ షెకావత్
పర్యావరణశాఖ- భూపేంద్రయాదవ్
విద్యుత్ శాఖ- శ్రీపాదనాయక్
హౌసింగ్ అండ్ అర్బన్- మనోహర్‌లాల్ కట్టర్
వ్యవసాయశాఖ సహాయ మంత్రి- పెమ్మసాని చంద్రశేఖర్
రోడ్డు రవాణా శాఖ సహాయమంత్రి-హర్ష్ మల్హోత్రా
చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహాయమంత్రి- శోభ కరంద్లాజే
సాంస్కృతికశాఖ, పర్యాటక సహాయమంత్రి- రావు ఇంద్రజిత్ సింగ్
టూరిజం శాఖ సహాయమంత్రి- సురేష్ గోపి
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
