ఆదోని కొండల్లో వేసిన దేవాలయాలకు దర్గాలకు భక్తులు తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని ఆటోలలో వెళ్తున్నారని అయితే అధికారులు నాయకులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నథడ్ ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేసి వివరిస్తున్న మాజీ కౌన్సిలర్ ఇస్మాయిల్

కర్నూలు జిల్లా ఆదోని కొండలలో వెలసిన రణమండల ఆంజనేయ స్వామి దేవాలయానికి, షా తహర్ షా ఖాద్రి దర్గా, ఎల్లమ్మ అవ్వ దేవాలయానికి మరియు అక్కడున్న ఇతర దర్గాలకు నిత్యం భక్తులు వందల సంఖ్యలో వెళుతుంటారు. అయితే కొండ ప్రాంతం ఆటోలో వెళ్లాలంటే భక్తులు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని దేవాలయాలకు దర్గాలకు వెళ్లే పరిస్థితి ఉందని అంతే కాక ఆప్రాంతం ఒక పర్యాటక స్థలం అయినందున ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆదివారం మాజీ కౌన్సిలర్ నథడ్ ఇస్మాయిల్ ఆర్టీసీ డిపో మేనేజర్ రఫిక్ కు వినతి పత్రం అందజేశారు.

మాజీ కౌన్సిలర్ ఇస్మాయిల్ మాట్లాడిన వీడియో

ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నథడ్ ఇస్మాయిల్ మాట్లాడుతూ దేవాలయం, దర్గా వంటి పర్యాటక స్థలాలకు బస్సు సౌకర్యం కల్పించడం చాలా అవసరం అన్నారు. బస్సు యాత్రికుల సౌకర్యాన్ని పెంచుతుంది, అలాగే ఆర్టీసీకి ఆదాయం కూడా వస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *