కర్నూలు జిల్లా ఆదోని మండలం హనువాలు గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న హుసేనప్ప అనే వ్యక్తిని సెబ్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 50 వేలు విలువచేసే కర్ణాటక మద్యం, ఒక స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు.
సిఐ విన్నీ లత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో ఎన్ఫోరసెమెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ పర్యవేక్షణ లో ఆదోని సెబ్ పోలీసులు ఆదోని మండలం హనువాలు గ్రామ బ్రిడ్జ్ సమీపంలో హుసేనప్ప అనే వ్యక్తి వద్ద నుండి సుమారు 50,000 విలువ చేసే ఒరిజినల్ ఛాయిస్ విస్కీ 90ml 12 బాక్సుల ను (1152 టెట్రా ప్యాకెట్స్), ఒక స్కూటర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై ఇస్మాయిల్, సిబ్బంది పాల్గొన్నారు.