కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మండిగిరి హైస్కూల్లో డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనాలు సరిగ్గా పెడుతున్నారా లేదా అని విద్యార్థులను విచారించారు. ఈ సందర్భంగా డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ విద్యార్థుల కు గదులు సరిపోవడం లేదని అదనంగా గదులు లేక బయట కూర్చొని చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు గదులు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల కోసం DSF విద్యార్థి సంఘగాం ఎప్పుడు ముందుంటుందని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘు, పట్టణ కార్యదర్శి వినీల్, రాజేష్, వీరభద్ర తదితరులు పాల్గొన్నారు.