కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మదిరే క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 8 బాక్సులు కర్ణాటక మధ్యాన్ని సీజ్ చేశారు సెబ్ అధికారులు. సెబ్ అధికారులు ఇచ్చిన వివరాల మేరకు పర్వతాపురం గ్రామానికి చెందిన పి. షేక్ షా వలి అనే వ్యక్తి మోటర్ సైకిల్ పైన 8 బాక్సులు కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తుండగా సేబ్ అధికారు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఈ దాడులలో సేబ్ ఇన్స్పెక్టర్ హరి కృష్ణ, ఎస్సై లు శివ ప్రసాద్, మధు సుడన రెడ్డి, పి సి సోమేశ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.