విశ్వనారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలి: పిడిఎస్‌యు డిమాండ్
కర్నూలు జిల్లా ఆదోని : ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న విశ్వనారాయణ కళాశాలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) డిమాండ్ చేసింది. స్థానిక కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడారు. ఇంటర్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి ఒకే భవనంలో సాధారణ ఇంటర్, ఒకేషనల్ కోర్సులు నడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా కళాశాల నడుస్తోందన్నారు. … Read more