ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష తాత్కాలిక విరామం
కర్నూలు జిల్లా అదోనిలో గత 269 రోజులుగా ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు తాత్కాలికంగా విరామం లభించింది. ఆదోని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కే. మీనాక్షి నాయుడు విజ్ఞప్తి మేరకు జేఏసీ నాయకులు దీక్షా శిబిరాన్ని విరమించి వేదికను తొలగించారు. దీక్ష విరమణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ — రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, … Read more