Category: News

రాంగ్ పార్కింగ్, రికార్డ్స్, డి.ఎల్ లేని 38 వాహనాలకు జరిమాన

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ మరియు ఆదోని డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోని పట్టణ పరిసరాలలో ప్రమాదాలు నివారించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. ఈ స్పెషల్ డ్రైవ్ లో రాంగ్ పార్కింగ్, రికార్డ్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని 38 వాహనాలకు Rs.10,930/- జరిమానా విధించారు, 9 వాహనాలను ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి రాసి పంపినట్లు అదేవిధంగా డ్రంకన్ & డ్రైవ్ […]

40 సం. గా ఉన్నాము పొజిషన్ సర్టిఫికెట్ ఇవండి.

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను […]

పేపర్ లీకేజీ స్కాంలలో ఇంకెంత మంది విద్యార్థులు బలైపోవాలి? పిడిఎస్ఓ

కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నీట్ – 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన స్కాంలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయుటకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ పరీక్షకు ఒకరోజు […]

విద్యాధికారులు కుర్చీలకే పరిమితమయ్యారా? DSF

ఆదోని పట్టణంలో SC BC సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి హాస్టల్ సీటు ఇవ్వాలని DSF ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ లో కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం […]

మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం

అమరావతి: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ – 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలిసంతకం చేసి, కేబినెట్ కు పంపారు. పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. బాధ్యతల స్వీకరణ […]

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వయసు సుమారు 25 నుంచి 30 సం. ఉండవచ్చని క్రీమ్ మల్టీకలర్ చుక్కలు గల టీ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి వున్నాడు. ఆచూకీ తెలిసినవారు RPSI గోపాల్ ఫోన్ No. 9849157634. ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.

కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా రంజిత్ బాషా

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సృజన బదిలీ కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా పి రంజిత్ బాషా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ గా ఉన్న పి రంజిత్ బాషాను కర్నూలు జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ గా ఉన్న గుమ్మల్ల సృజనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు.

రామజలలో భారీ చెట్టు పడి పైప్లైన్ ధ్వంసం

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ విలేకరులు ఇచ్చిన ప్రకటనలో బసాపురం రిజర్వాయర్ నుండి పంపింగ్ ద్వారా రామజల ఫిల్టరేషన్ ప్లాంటుకు వచ్చే 600 mm dia CI పైప్ లైన్ మీద భారీ చెట్టు పడి పైప్ లైన్ పూర్తిగా దెబ్బ తినడంతో ఆదోని మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పైప్ లైన్ మరమ్మత్తు మరియు పునరుద్ధణ పనులు చేస్తున్నారని తెలిపారు. అందువల్ల ఆదోని పట్టణ ప్రజలు రామజల ఫిల్టరేషన్ ప్లాంట్ నుండి త్రాగు నీరు […]

17 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 17 మంది పేకాటరాయుళ్లను తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 స్కూటర్లు 13 సెల్ ఫోన్లు, నగదు సుమారు 93వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఇంకా 6 మంది పేకాట రాయుళ్లు పరారైనట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

నందమూరి తారకరామారావు కుమార్తె ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు కుటుంబ సమేతంగా ఘనంగా నిర్వహించుకున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

Back To Top