మండలంలో ఉపాధి హామీ పనులు కల్పించి వలసలు నివారించాలని, ఉపాధి హామీ పాండవుగల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా వీరమ్మను కొనసాగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా..కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ఇన్చార్జి ఎ పీవో కాలిక్ భాషలకు అందజేశారు. ఆదోని మండలంలో వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో వలసలకు వెళ్తున్నారని వలసల […]
నటి శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనితలపై సోషల్మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐకి ఫిర్యాదు చేసిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మ.బీఎన్ఎస్ సెక్షన్లు 196, 353, 79, 67 కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారన్న పద్మ.గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులపైనే కాక వారి కుటుంబాలపై కూడా సోషల్మీడియాలో శ్రీరెడ్డి చెప్పరాని వ్యాఖ్యలు చేసిందని, ఆమెను స్త్రీ జాతి నుంచి వెలేస్తున్నామని వెల్లడి.
తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి
ఇవాళ్టీ నుంచి బడ్జెట్ సమావేశాలు.● సమావేశాల తొలి రోజునే బడ్జెట్ పెట్టనున్న ప్రభుత్వం.● తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.● ఉదయం 10గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్.● మంత్రి పయ్యావులకు బడ్జెట్ పత్రాలు అందచేసిన ఆర్థికశాఖ అధికారులు.● మంత్రికి బడ్జెట్ పత్రాలు అందించిన పీయూష్ కుమార్, జానకీ, నివాస్.● బడ్జెట్ పత్రాలకు పూజలు నిర్వహించిన కేశవ్.● బడ్జెట్ పత్రాలతో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పయ్యావుల.● అర్థరాత్రి వరకు బడ్జెట్టుపై తుది […]
ఎమ్మిగనూరులో జాబ్ మేళా.. జిల్లా ఉపాధి అధికారి
ఎమ్మిగనూరులో జాబ్ మేళా.. జిల్లా ఉపాధి అధికారికర్నూలు జిల్లా నైపుణ్య మరియు శిక్షణ శాఖా వారి అద్వర్యంలో 12.11.2024 మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, వైఎస్ఆర్ సర్కిల్, ఎమ్మిగనూరు లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి పి.దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్ధులు మీ విద్యార్హతకు సంబందించిన ధ్రువ పత్రాలు, ఫొటోస్, తీసుకుని రావాలని తెలిపారు. మహిళా మరియు పురుష అభ్యర్థులు ఉద్యోగ మేళా లో పాల్గొని […]
సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలి.. సిపిఎం
అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావి, శంకర్ నగర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరు కార్యక్రమం నిర్వహించరు. అనంతరం ప్రజాపోరు పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న పట్టణ […]
పేద ప్రజలను ఇబ్బంది పెడితే హాస్పిటల్ పై చర్యలు తప్పవు
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగెరి గ్రామానికి చెందిన బుడిజగ్గుల మునిస్వామి అనే వ్యక్తికి వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹ 1లక్ష 6 వేల 9 వందల రూపాయల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఇప్పటివరకు నాలుగు చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 5 లక్షలు రూపాయల వరకు అందించామని తెలిపారు. ఆరోగ్యశ్రీకి మించి ఖర్చు వచ్చిన ఆరోగ్యశ్రీ లేదు అన్న […]
గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం జింకను ఢీ కొనడంతో పంట పొలాల్లో ఎగిరి పడి జింక మృతి చెందింది. గ్రామసభ ఎమ్మార్వో వెళ్తూ పంట పొలాల్లో పడి ఉన్న జింకను చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు జింకను పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కారాలు చేశారు.
ప్రజా పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. CPM
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నదని, అలాగే దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నదని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు విమర్శించారు.కర్నూలు జిల్లా ఆదోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు వీరారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి […]
బిజెపి పార్టీలో చేరిన మైనార్టీ నాయకులు
కర్నూలు జిల్లా ఆదోని 11వ వార్డు వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్ వాసీం మరియు హవన్నపేట ముస్లిం మైనారిటి నాయకుడు ఖలీల్ అహ్మద్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సమక్షములో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి లో చేరిన కౌన్సిలర్ వాసీం మాట్లాడుతూ నాపైన నమ్మకంతో నా వార్డు ప్రజలు గెలిపించారని కానీ వైఎస్సార్ పార్టీలో నాకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నేను నెరవేర్చాలంటే, ఆదోని అభివృద్ధి ఎమ్మెల్యే పార్థసారథి తో […]
వాటర్ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య యత్నం
కర్నూలు జిల్లా కౌతాళంలో డేవిడ్ అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించడు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు.పది రోజుల క్రితం కూతురు అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్థాపానికి గురై వాటర్ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య యత్నంకు పాల్పడినడు డేవిడ్.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని డేవిడ్ ను కిందకు దింపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.