అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావి, శంకర్ నగర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరు కార్యక్రమం నిర్వహించరు. అనంతరం ప్రజాపోరు పోస్టర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, ముక్కన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడం దారుణమని వారు తెలిపారు. అన్నిటికంటే ముఖ్యమైన పిల్లల చదువుకు సంబంధించి తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు ₹1500, రైతు భరోసా క్రింద 20వేల రుపాయాలు తదితర పథకాలు నేటికీ అమలుకు నోచుకోలేదని వారు తెలిపారు. మెగా డీఎస్సీ నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు అందని ద్రాక్షాగా మారిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు తాము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు వీరేష్, నాగేంద్ర, నాగరాజు, మల్లయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.