Author: Public Judgement

ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. AP 39TZ 1980 నెంబరు గల ఇసుక ట్రాక్టర్ ఢీకొని బోయ నాగిరెడ్డి (50) అనే వ్యక్తి మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయాన్నే తోపుడు బండిలో పశువులకు గడ్డి తీసుకుని వెళ్తుండగా వెనకనుంచి  ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టిందని తెలిపారు. మృతుడికి ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి […]

ఆదోని డివిజన్ వ్యవసాయ అధికారుల శిక్షణ కార్యక్రమం

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ సహాయ సంచాలకులు వారి కార్యాలయంలో శుక్రవారం ఆదోని డివిజన్ పరిధిలోని  గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు విస్తరణ అధికారుల కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పత్తి, వేరుశనగ, శనగ పంటలలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రస్తుత పంటలలో ఎదుర్కొంటున్న తెగుళ్లు పురుగుల నివారణ చర్యలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో , ఏరువాక కేంద్రం కర్నూలు ప్రధాన శాస్త్రవేత్త Dr. K. సుజాత, ఆదోని సహాయ వ్యవసాయ సంచాలకులు […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 25-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7569/- రూపాయలు కనిష్ట ధర ₹. 4719/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6369/- రూపాయలు కనిష్ట ధర ₹. 3306/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5967/- రూపాయలు కనిష్ట ధర ₹.4570/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటి వివరాలు ఇలా ఉన్నాయి.• దీపావళి కానుకగా అక్టోబర్ 31 నుంచి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం..• రూ. 2684 కోట్లతో  ఏటా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీకి 3 ఎల్పీజీ కంపెనీలతో ఒప్పందం..• 24 గంటల్లో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ అమౌంట్‌ జమ..• ఉచిత ఇసుకను ఎడ్ల […]

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం

అమరావతి: టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రికార్డు సృష్టించడానికి సిద్ధం కండి అన్నారు. బాబు ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందిని తెలిపారు. సభ్యత్వ రుసుము 100 రూపాయలు చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకోవాలని సభ్యత్వం పొందిన వారికి 5 లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు.

పరిమితిని మించి ప్రయాణించే  వాహనాలపై చర్యలు తీసుకోండి.. సబ్ కలెక్టర్

రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టండి..పెండింగ్ లో ఉన్న రోడ్డు మరమ్మత్తుల పనులను త్వరతగతిన పూర్తి చేయండి..పరిమితిని మించి ప్రయాణించే  వాహనాలపై చర్యలు తీసుకోండి.. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.. రోడ్డు  ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్  సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో డివిజన్ స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.  […]

స్వల్పంగా తగ్గిన పత్తి ధర

తేదీ 22-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7551/- రూపాయలు కనిష్ట ధర ₹. 4607/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6266/- రూపాయలు కనిష్ట ధర ₹. 3309/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5993/- రూపాయలు కనిష్ట ధర ₹.3407/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

వివాహిత ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతి నగర్ లో విషాదం చోటు చేసుకుంది. పావని (20) అనే వివాహిత ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పావని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి అమరావతి నగర్ కు చెందిన శ్రీనివాస్ మొదటి భార్య వదిలేసి వెళ్లిపోవడంతో వాల్మీకి నగర్ కి చెందిన పావనికి 2021 లో శ్రీనివాస్ తో పెద్దల సమక్షంలో రెండవసారి వివాహం జరిగింది.  […]

భారత దేశంలో ప్రతి రోజూ 8 మంది అపహరణకు గురి అవుతున్నారు

కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం ఫెయిత్ హోమ్ ఫర్ చిల్రెన్ మరియు ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ది మ్యుమెంట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ వారి ఆధ్వర్యంలో భారత దేశంలో ఏక కాలంలో 15 రాష్ట్రాలలో, 100 పైగా  ప్రదేశాల్లో, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) మీద జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథితులుగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, డి.ఎస్. సోమన్న పాల్గొన్నారు. ఈ […]

స్వల్పంగా పెరిగిన పత్తి ధర

తేదీ 19-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7678/- రూపాయలు కనిష్ట ధర ₹. 4309/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6474/- రూపాయలు కనిష్ట ధర ₹. 3312/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6088/- రూపాయలు కనిష్ట ధర ₹.3700/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4836/- రూపాయలు కనిష్ట ధర ₹.3628/- రూపాయలు పలికింది. […]

Back To Top