పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం జాలవాడి సచివాలయం సమీపంలో  కురువ గులెప్ప అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు గమనించి మంటలను ఆర్పి అంబులెన్స్ ద్వారా ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి..
కంబలదిన్నె గ్రామానికి చెందిన కురువ గులెప్పగా  పోలీసులు గుర్తించామని తెలిపారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు కుటుంబ కలహాలుతో అని కొందరు, అప్పుల బాధతో అని మరికొందరు ఆత్మహత్య యత్నంకు పాల్పడి ఉండవచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కురువ గులెప్ప ను బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తున్న ఫోటో
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కురువ గులెప్పు

Leave a Comment