కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యులు డా.పార్థసారథి వాల్మీకి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఆదోని ప్రాంతంలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో ప్రతి నెల సుమారుగా 450 ప్రసవాలు జరుగుతున్నాయని, 10 మంది నర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. అదేవిధంగా ఆదోని లో ఆరోగ్య శ్రీ క్రింద కొన్ని ఆస్పత్రులు రోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వారిపై తగిన […]
ప్రజా సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ బసరకొడు గ్రామ శాఖ మహాసభ, హుసేని అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించరు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.ఉచ్చిరప్ప మాట్లాడుతూ స్థానికంగా రోడ్లు సమస్యలు, అలాగే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ సమస్యలను పరిష్కరించాలని, అలాగే గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు పంపిణీ […]
సెలవు దినాల్లో క్లాసులు నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోండి
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలిఅని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేసిన DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘు.
అదోనిలో భారీ నిరసన ర్యాలీ
కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం ముస్లిం మైనార్టీలు షాహి జామియా మజీద్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేత. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మైనార్టీ నాయకులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
ఆదోని వ్యవసాయ మార్కెట్లో రూ.7680 పలికిన పత్తి ధర
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 07-10-24 పత్తి అత్యధికంగా ₹. 7680- రూపాయలు కనిష్ట ధర ₹. 4280/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7240/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5993/- రూపాయలు కనిష్ట ధర ₹.3900/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5578/- రూపాయలు కనిష్ట ధర ₹.4956/- రూపాయలు పలికింది. […]
