ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ గాంధీ సరోవర్‌ ప్రాంతంలో ఆదివారం(జూన్‌30) ఉదయం మంచు తుపాను చెలరేగింది. ‘కేదార్‌నాథ్‌ దామ్‌ వెనుకాల ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం 5 గంటలకు మంచు తుపాను వచ్చింది. దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. పర్వతం మీద నుంచి మంచు కిందికి వచ్చింది. ఇది కేదార్‌నాథ్‌లో అలజడికి కారణమైంది’అని రుద్రప్రయాగ్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ విశాఖ అశోక్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *