కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్న బసవరాజు (22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచి పక్క గదిలో ఫ్యాన్ కు వేలాడుతున్న భర్తను చూసిన భార్య కవిత వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. రెండు నెలల క్రితమే హత్రి బెలగల్ గ్రామానికి చెందిన కవితకు బసవరాజుకు వివాహమైంది. వివాహమైన రెండు నెలలకే ఇలా జరగడంతో సంతెకుడ్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్య కారణాలు తెలియాల్సి ఉంది..