కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో మాన్వి దేవేంద్రప్ప ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అత్యధిక మెజార్టీతో గెలుపు సాధించి నందుకు గ్రామంలో అన్ని దేవస్థానమునకు టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు విజయోత్సవ ర్యాలీలో పాల్గొని మాన్వి దేవేంద్రప్పకు శాలువాల కప్పి పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు టిడిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.