ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని ఎస్టీలకు కేటాయించాలి.. ఎరుకల రవికుమార్

రాబోయే పురపాలక ఎన్నికల్లో ఆదోని మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానాన్ని ఎస్టీ వర్గానికి కేటాయించాలని ఆదోని డివిజన్ ఎస్సీ/ఎస్టీ డీవీఎంసీ సభ్యుడు ఎరుకల రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం సమర్పించారు.

మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేస్తున్న ఎరుకల రవికుమార్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: ★ 1865లో ఏర్పాటైన ఆదోని మున్సిపాలిటీ 162 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎస్టీలకు చైర్‌పర్సన్ పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రొటేషన్ పద్ధతిలో అన్ని వర్గాలకూ అవకాశం వచ్చినా ఎస్టీలు ప్రాతినిధ్యానికి నోచుకోలేదన్నారు. ★ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243T మరియు రొటేషన్ నిబంధనల ప్రకారం ఈసారి చైర్‌పర్సన్ పీఠాన్ని ఎస్టీలకే రిజర్వ్ చేయాలన్నారు. ★ పట్టణంలో 10 వేలకు పైగా ఉన్న గిరిజన జనాభా దృష్ట్యా, పెరిగిన 52 వార్డుల్లో కనీసం 3 కౌన్సిలర్ స్థానాలను ఎస్టీలకు కేటాయించి రాజకీయ న్యాయం చేయాలని కోరారు.