వెరిఫికేషన్ పేరుతో అర్హుల పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదని ఆదోని వైసీపీ దివ్యంగుల మండల అధ్యక్షుడు హనుమంత రెడ్డి హెచ్చరించారు.
కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ దివ్యంగుల మండల అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత కాంగ్రెస్,టిడిపి, వైసిపి ప్రభుత్వాల హయాంలో సదరం క్యాంపుల ద్వారా వికలాంగుల ధ్రువీకరణ పత్రం పొంది అప్పటినుండి పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులకు వెరిఫికేషన్ చేయాలనే పేరుతో నోటీసులు ఇవ్వడం సరికాదని ఈ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో డాక్టర్ల సిఫారసు మేరకే సదరం క్యాంపు ల ద్వారా సర్టిఫికెట్లు పొందిన వారిని మళ్లీ విచారణ పేరుతో తొలగించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 6000కు పెంచుతానని ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటివరకు పెన్షన్లు ఇచ్చి, ఇలా అర్ధాంతరంగా విచారణ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నోటీసులు ఇచ్చిన వికలాంగులందరితో కలిసి పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరించారు.