కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ట్రాఫిక్ సమస్యపై పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, డిఎస్పి మేడం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆదోనిలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ మరియు పట్టణం నందు సీసీ కెమెరాలు, స్పీడ్ బ్రేకర్లు ముఖ్యమైన సర్కిల్స్లో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయటం అదే విధంగా రోడ్డుకు అడ్డంగా ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం గురించి చర్చించరు. ఈ సమావేశంలో మున్సిపాల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎసిపి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సిఐ పాల్గొన్నారు.