కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయనగర్ లో కోడి పందెము ఆడుతున్న 16 మంది జూదగాళ్లు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 72 వేల నగదు రెండు కోడిపుంజులు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ సీజ్ చేశారు.
సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO వారి పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ శ్రీ రామ్ వారి సిబ్బంది రాయనగర్లో బయలుస్థలములో డబ్బును పందెములు గా పెట్టి కోడి పందెమ్ ఆడుతున్న 16 మంది జూదగాళ్లను A1 సయ్యద్ జవీద్ బాష, A2 గుంటన్న, A3 చూడిఫారోష్ టిప్పు సుల్తాన్, A4 చాకలి వీరేష్, A5 భీమ శేఖర్, A6 P.G. మాధవ, A7 షికిల్ ఘర్ షాషావలి @ JBL షాషా, A8 బెస్త శ్రీనివాసులు @ కొళ్ళ సీన, A19 M. లతీఫ్ @ లతీఫ్ బాష, A10 ఫాణిభన్ షంషుద్దీన్, A11 ముల్లా షాషా, A12 షేక్ ఇస్మాయిల్, A13 బెస్త రామాంజినేయులు @ ప్లంబర్ అంజి, A14 అబ్దుల్ గఫూర్, A15 మహబూబ్ బాష @ సల్మాన్ @ షేక్ మహబూబ్ బాషా, A16 తెలుగు శ్రీనివాసులు @ సెంట్రింగ్ సీన లను అరెస్టు చేసి Rs. 72,000/- నగదు మరియు 02 కోడి పుంజులను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై 9(1) APG Act (Cock Fight) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాట్లు సిఐ శ్రీరామ్ తెలిపారు.