కర్నూలు జిల్లా ఆదోని శివారు ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో కల్లుబావికి చెందిన తరుణ్ (22)అనే యువకుడికి గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి పడిపోవడంతో. అటువైపు వెళ్తున్న వన్ టౌన్ సిఐ శ్రీరామ్ గమనించి తన వాహనంలో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కల్లుబావి వీధికి చెందిన బిల్డర్ నాగరాజు, జయలక్ష్మిల రెండవ సంతానం తరుణ్ అని స్థానికులు తెలిపారు.