News
నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి
నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి అనే చందంగా మారింది ఆదోని సబ్ రిజిస్టర్ కార్యలయం.. ఒకటి మరవక ముందే మరొకటి నకిలీ పత్రాల భాగవతం బయటపడడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన మొదలైంది.. ఇంకా ఇలా ఎన్ని జరిగాయి అని ఆదోని ప్రజలు చర్చించుకుంటున్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో కోట్ల విలువ చేసే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు యగ్గటి ఈశ్వరప్ప సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేపట్టారు. బతికున్న వ్యక్తికి మృతి చెందినట్లు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి అముదాల భాస్కర్ అనె వ్యక్తి కోట్ల భూమిని చాకలి ఇరన్న అనే వ్యక్తికి జి.పి. (జండ్రల్ పవర్ ఆఫ్ అటార్నీ) ఎలా చేసుకున్నాడని సబ్ రిజిస్టర్ ను బాధితులు యగ్గటి ఈశ్వరప్ప , కుమారులు మోహన్, సునిల్ నిలదీశారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో యగ్గటి ఈశ్వరప్ప,, సబ్ రిజిస్టర్ హాజీమియా ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఎగటి ఈశ్వరప్పకు ఇద్దరు కుమారులు మోహన్ సునీల్ బండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలో 7 ఎకరాల 41 సెంట్లు భూమి ఉంది. అందులో 90 సెంట్లు నేషనల్ హైవేకి పోగా మిగిలిన ఆరు ఎకరాల 51 సెంట్లు భూమి మిగిలింది ఆ భూమిపై కన్నేషన్ అక్రమార్కులు ఆముదాల భాస్కర్ అనే వ్యక్తి తన పేరు ముందు ఎగటి అని జోడించి ఎగటి ఆముదాల భాస్కర్ గా పేరు మార్చుకుని తండ్రి ఎగటి ఈశ్వరప్ప చనిపోయాడని నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి డిసెంబర్ 31వ తేదీ చాకలి ఇరన్న అనే వ్యక్తి కి జి.పి. (జండ్రల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేసి రిజిస్ట్రేషన్ చేశారు. జనవరి నాలుగవ తేదీ ఎగటి ఈశ్వరప్పకు సమాచారం రావడంతో సబ్ రిజిస్టర్ నిలదీశారు ఆఫీస్ ముందు బెటాయించి ఆందోళన చేశారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆరు మందిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..


News
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్‌కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


