విజయవాడలో జనవరి 5 న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే ‘హైందవ శంఖారావం ‘ బహిరంగ సభ ఏర్పాట్ల గురించి డిజిపి ద్వారకా తిరుమల రావును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కలిసి వివరించాను. రెండు లక్షల మంది రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు హాజరవుతున్నట్టు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నందున సమస్యలు రాకుండా ముందుగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. పోలీస్ శాఖ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని డిజిపి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు.