కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్. సిపిఐ
కర్నూలు జిల్లా ఆదోని బీమా సర్కిల్లో శుక్రవారం భారత కమ్యూనిస్టు సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. పార్లమెంట్ సమావేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక బీమాస్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు, సీనియర్ నాయకులు లక్ష్మి రెడ్డి, పార్టీ ప్రజాసంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.