కర్నూలు జిల్లా ఆదోని శివారులో తెల్లవారు జామున ఎమ్మిగనూరు బైపాస్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తపింది. కర్ణాటక కు చెందిన కె ఎ.02ఎం యు 5864 నెంబర్ గల కారు బెంగళూరు నుండి దైవదర్శనానికి మంత్రాలయానికి వెళుతుండగా అదుపుతప్పి డివైడర్ పైకెక్కి స్తంబానికి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.