నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా ఆదోని తహశీల్దారు శివ రాముడు పేర్కొన్నారు. శనివారం ఆదోని తహశీల్దారు వారి కార్యాలయంలో ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో కలిసి నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ. మండలం పరిధిలో పెద్ద హరివాణం, సంతకుడ్లూరు, యడవలి , బలాదూర్, చిన్నగొనేహళ్, మాదిరే, బసపురం, ఇస్వీ, దనాపురం, నగనాతహల్లి, గ్రామాలకు సంబంధించి నీటి సంఘాల ఎన్నికల ఓటరు జాబితాను సిద్ధం చేసి ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో 6వ తేదీ నుంచి 10వ తేది వరకు ప్రచురించలని. ఏదైనా సందేహాలు ఉంటే 11వ తేది నుండి 12వ తేది వరకు దరఖాస్తులను స్వీకరించలని తెలిపారు. పటిష్టమైన ఓటరు జాబితాను తయారు చేయాలని సంబంధిత అధికారులకు తహశీల్దారు శివ రాముడు ఆదేశించారు.