కర్నూలు జిల్లా ఆదోని అరుంజ్యోతి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. సంజన్న అనే వ్యక్తి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. సంజన్న కుటుంబసభ్యులు తమ ఇంటి రాస్తాలో అడ్డంగా పాతిన బండలను తొలగిస్తే శవాన్ని తీసుకుని వెళతామని లేదంటే న్యాయం జరిగే వరకు కదలమని ధర్నాకు కూర్చున్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, అసిస్టెంట్ కమీషనర్, ఇరువర్గాలను సర్ది చెప్పి కూర్చున్న ఫోటో

బంధువులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి తమ ఇంటికి వెళ్ళే రాస్తా కబ్జా చేసి బండలు అడ్డంగా పాతడంతో గత కొంతకాలంగా సంజన్న కుటుంభం సభ్యులు గుడిలో నివాసం ఉంటున్నమని తెలిపారు. బుధవారం సాయంత్రం సంజన్న మృతి చెందడంతో న్యాయం కోసం శవంతో బుధవారం సాయంత్రం నుండి రోడ్డుపై బైటాయించరు. న్యాయం జరిగేంత వరకు శవాన్ని పూడ్చమంటూ బందువులు డిమాండ్ చేయడంతో గురువారం అధికారులు, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, అసిస్టెంట్ కమీషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇరువర్గాలను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గురువారం మధ్యాహ్నం పోలీసుల సహాయంతో బండలను తొలిగించడంతో ఘర్షణ సర్దు మనిగిందని తెలిపారు.

అడ్వర్టైజ్మెంట్
యూట్యూబ్ వీడియో
ముందుండి బండలను తొలగిస్తున్న పోలీసులు
బండలను తీస్తున్న కార్మికులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *