AP: ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రత ఫొటోలను అప్లోడ్ చేసే బాధ్యతను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది.
ప్రతి సోమ, గురువారాల్లో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి స్కూళ్లను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలను తీసి అప్లోడ్ చేయాలని ఆదేశించింది.
ఇందుకోసం IMMS యాప్లో లాగిన్ అయ్యేందుకు వారికి అవకాశం ఇచ్చింది.
కాగా, ఇది వరకు ఈ బాధ్యత ఉపాధ్యా యులపై ఉండేది.