తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 09.08.2024 నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ దాడిలో హత్యకు గురైన పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం చేరుకుని పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని బెంగళూరు బయలుదేరి వెళతారు.
సుబ్బారాయుడు కుటుంబాన్ని తమ నాయకుడు వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు నంద్యాల జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ప్రకటించారు.