కర్నూలు జిల్లా కోసిగి మండలం దిద్ది గ్రామ సమీపంలో చెరువు వద్ద ఎదురుగా వాహనం రావడంతో రోడ్డు కిందికి దింపి రోడ్డుపైకి ఎక్కించే ప్రయత్నంలో స్కూటర్ అదుపుతప్పి కిందపడపడటంతో గుడికళ్ళు గ్రామానికి చెందిన సల్మాన్ (35), అనె వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అభీష్ట (20) కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ కు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు.