ఎమ్మెల్యే గా నా మొదటి నెల జీతం ప్రజా అవసరాలకు అంకితం అన్నారు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి..
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవికి ఎమ్మెల్యేగా వచ్చిన తన మొదటి నెల జీతంతో జడ్డంగి, రాజవొమ్మంగి, లాగరాయి ఆసుపత్రులకు బ్యాటరీలు, ఇన్వెర్టర్లు ఇపించారు. ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ ప్రజా అవసరాల దృష్ట్యా నా మొదటి నెల జీతంతో సొంతగా ఇన్వెర్టర్లు, బ్యాటరీలను కొనుగోలు చేసి అందిస్తున్నా అని ఆమె తెలిపారు.