కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో గర్ల్స్ హాస్టల్ కు రెగ్యులర్ వార్డెన్ నియమించాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఇంచార్జ్ బాలస్వామికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డీ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థుల నుండి దాదాపుగా1800 రూపాయలు ఫీజులు వసూలు చేసి బాలికల హాస్టల్ కు రెగ్యులర్ వార్డెన్ లేకపోవడం చాలా సిగ్గుచేటని, ఇప్పటికైనా గర్ల్స్ హాస్టల్ కు రెగ్యులర్ వార్డెన్ ను నియమించకపోతే క్లాసులు బైక్ కాట్ చేస్తామని ఆర్ట్స్ కళాశాల యాజమాన్యానికి డిమాండ్ చేసినట్లు తెలిపారు. అంతేకాక విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సదుపాయాలు కళాశాలలో కల్పించాలని ఆర్ట్స్ కళాశాల ఇంచార్జ్ బాలస్వామి ని కోరారు. ఈ ధర్నాలో డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు నవీన్ నరసింహులు వినీల్ రాజేష్ విక్రమ్ హనుమేష్ వీరభద్ర తదితరులు పాల్గొన్నారు.

ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్న డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *