Connect with us

News

హాస్టల్ బాత్రూంలో ప్రసవించిన బాలిక కేసులో విస్తుపోయే వాస్తవాలు

Published

on

ప్రకాశం జిల్లాలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న 16 ఏళ్ళ బాలిక గర్భం దాల్చింది. అంతేకాదు తాను చదువుకుంటున్న హాస్టల్‌ బాత్రూమ్‌లో ప్రసవించిన కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పేరుతో ఒకరు, బెదిరించి మరొకరు, డబ్బుల ఆశచూపి ఇంకొరు ఆమెపై లైంగిక దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. బాలిక స్వగ్రామంలో జరిగిన ఈ దారుణానికి బాలిక గర్భం దాల్చింది. భయంతో బాలిక ఎవరికీ చెప్పకపోవడంతో 8 నెలలు గర్భాన్ని మోసిన తరువాత తన హాస్టల్‌లోని బాత్రూమ్‌లో శిశువుకు జన్మనిచ్చింది. ట్రంక్ పెట్టెలో మృత శిశువును దాచిపెట్టింది.తరువాత పోలీసులు మార్చూరీకి తరలించారు. బాధితురాలికి వైద్యం అందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు యువకులను ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారు.

కేజీబీవీలో ఔట్‌సోర్సింగ్‌పై ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న జె.సత్యవతి ప్రతిరోజూ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉండగా, పాఠశాలలో బాలిక గర్భంతో ఉన్నప్పటికీ ఇద్దరు ఉద్యోగుల తో పాటు గా గర్భం గుర్తించకపోవటంపై ఆమెను కూడా కలెక్టర్ తమీర్ అన్సారియా గారు ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. మరోవైపు విద్యార్దిని గర్భం దాల్చడానికి దారితీసిన పరిస్థితులపై పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల విచారణలో సంచలనాలు..
ఈ విషయాన్ని స్థానిక మహిళా పోలీసు ద్వారా కొత్తపట్నం పోలీసులకు తెలియచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో బాలిక స్వగ్రామానికి చెందిన సైదాబాబు ప్రేమ పేరుతో, అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులురెడ్డి, వెంకటరెడ్డిలు బెదిరించి, డబ్బుల ఆశచూపి లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడినట్టు తేల్చారు. ముగ్గురు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్టు జిల్లా ఎస్‌పీ ఎఆర్‌ దామోదర్‌ తెలిపారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

ఆదోని 09-01-2026:

కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు

09 01 26 రైతు బజార్ ధరల పట్టిక
అడ్వర్టైజ్మెంట్
Continue Reading

News

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక

Published

on

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.

Continue Reading

News

కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.

కాలుతున్న పత్తి
మంటలు ఆర్పుతున్న స్థానికులు
మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
జెసిబి తో పత్తిని పక్కకు చూస్తున్న ఫోటో
Continue Reading

Trending