Connect with us

Magazine Stories

40 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ రత్న భండార్ రహస్యలు బయట పడబోతున్నాయి.

Published

on

చాలా సంవత్సరాల తర్వాత రత్న భండార్‌ను తిరిగి తెరవడం ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యంగా చరిత్రలో నిలిచిపోతుంది.

ఒడిశా పూరీ లోని జగన్నాథ ఆలయం (1985) 40 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆలయములోని రత్న భండార్‌ నిధి గదిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గదిలోకి ప్రవేశించడానికి 16 మంది సిద్ధమయ్యారు. ఆలయంలోని రహస్య మందిరాల్లోకి ప్రవేశించడానికి ముందు జాగ్రత్తగా చర్యలుగా భువనేశ్వర్ నుండి ప్రత్యేక బృందాన్ని మరియు అనుభవిజ్ఞులైన పాములు పట్టే వారిని పిలిపించారు. ఆలయంలోని గదిలోకి ప్రవేశించడం అంటే ఎంతో ధైర్య సాహసాలతో కుడిన నిర్ణయం. త్రాచు పాములు విష సర్పాలు ఉన్నాయని అవి నిధిని కాపాడుతున్నాయ ని ఆలయ పెద్దలు ఎప్పటినుంచి చెబుతున్న మాట.

ఈ తలుపులు తెరుచుకుంటే ఎన్నో రహస్యాలు బయటకు రానున్నాయి. 2018లో రత్న భండార్‌లో ప్రవేశించడానికి 16 మందితో ఒక బృందం ప్రయత్నించింది, అయితే భితారా భండార్‌కు తాళంచెవి లేకపోవడం తో ఆప్పుడు కుదరలేదు. 6 సంవత్సరాల తర్వాత, ఒడిశా ప్రభుత్వం 2024 జూలై 14న రత్న భండార్ రహస్యాలను బట్టబయలు చేయడానికి మరోసారి సిద్ధమవుతోంది. నాలుగు దశాబ్దాలలో రహస్య గదిలోకి అడుగు పెట్టడం ఇదే మొదటి సారి అని అంటున్నారు. అయితే జగన్నాథుని అరుదైన అమూల్యమైన సంపదను బయటపడె అవకాశం ఉందని భావిస్తున్నారు.

రహస్య గది తలుపులు తెరవడానికి రోజులు దగ్గర పడుతుండడంతో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తి రాత్ తీసుకోవలసిన చర్యలపై పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. రత్న భండారంలోని ఆభరణాలు, రత్నాలు వందల ఏళ్ల నాటివని, విలువైన వస్తువుల వివరాల్ని పగడ్బందీ జాబితా తయారు చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా చేయడానికి జులై 14 వ తేదీ ఉన్నతస్థాయి అధికారులకు తాళాలు అందించడానికి శ్రీ జగన్నాథ ఆలయ కమిటీకి నిర్వాహకులు సిద్ధమయ్యారు.

ఈ రత్న భండార్ వల్ల కేవలం నిధి నిక్షేపాలు గురించి కాకుండా రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (BJP) విజయం సాధించడానికి గతంలో ఎన్నికలలో చేసిన వాగ్దానం నెరవేర్చినట్లు చూపించు కోవడానికి అస్త్రంగా వాడుకుంటుంది. రత్న భండారాన్ని తెరవడం ద్వారా ప్రజలలో విశ్వాసం మరియు ఆలయ విలువైన వస్తూ సామాగ్రి భద్రత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది.


ఇంతకు ఎన్నో సంవత్సరాల ఎదురుచూస్తున్న రత్న భాండాగారం రహస్యాలు బట్టబయలు అవుతాయా? తప్పిపోయిన తాళాల రహస్యాలు బయటపడతా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే నిర్ణయిస్తుంది. అయితే రత్న భండార్‌ను తిరిగి తెరవడం ఎప్పటికీ గుర్తిండిపోయే సంఘటన.

జగన్నాథ ఆలయ తలుపులు తెరవడం కేవలం బంగారం మనీ మాణిక్యాలు బయటకు తీయడం అనేది కాదు, ఈ ఒక చారిత్రాత్మక సంఘటన. ఎంతో భక్తి శ్రద్ధలతో వారసత్వ సంపదను కాపాడుకోవడానికి ఇదొక గొప్ప నిర్ణయం.

Magazine Stories

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం.

Published

on

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థికశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థికశాస్త్రంలో డి.ఫిల్  పొందారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక గొప్ప రచనలు చేశారు. ఆయన రచించిన “ఇండియాస్ ఎగ్‌స్టార్ట్ ట్రెండ్‌స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్-స్టెయిన్డ్ గ్రోత్” (క్లారెండన్ ప్రెస్, ఆక్స్ఫర్డ్, 1964) అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా గుర్తించబడింది. తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మక డెల్హీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో పని చేసిన సంవత్సరాలతో మరింత పటిష్టంగా తన ఆర్థిక నైపుణ్యలను పెంచుకున్నారు. ఈ సంవత్సరాలలో ఆయన UNCTAD కార్యాలయంలో కొంత సమయం పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ఆయన జెనీవాలోని సౌత్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు.
1971లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. తరువాత 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. అలాగే, ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

1991 నుండి 1996 వరకు డాక్టర్ సింగ్ భారత దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది. ఆ కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ నిరాడంబర జీవితం గడుపుతున్నారు. ఆయన ప్రజా సేవా జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ (1987), జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం (1995), ఆసియా మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993-1994), యూరో మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993), యూనివర్సిటీ ఆఫ్ కేమ్బ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ (1956), సెంట్రల్ లండన్ లోని సెంట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ (1955) ఉన్నాయి. అలాగే, పలు దేశాలు అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాలలో, అంతర్జాతీయ సంస్థలలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు. 1993లో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్న్మెంట్ మీటింగ్ (సైప్రస్), 1993లో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్‌కు ఆయన నాయకత్వం వహించారు.
పోలిటికల్ కెరీర్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
1998 నుండి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు.
2004 జనవరి ఎన్నికల తరువాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 22 మే 2004న ప్రధాని పదవిని స్వీకరించారు.
2009 మే 22న రెండవసారి ప్రమాణం చేశారు.
*మన్మోహన్ సింగ్ సాధించిన 10 ముఖ్యమైన విజయాలు..!
1) 1991 ఆర్థిక సంస్కరణలు
2) సమాచార హక్కు చట్టం, 2005
3) NREGA (ఇప్పుడు MGNREGA)
4) ఇండో-యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్, 2008
5) విద్యా హక్కు చట్టం, 2009..
6) జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013
7) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM)
8) అధిక GDP వృద్ధి రేటు..
9) బంగారు చతుర్భుజం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు..
10) పటిష్టమైన విదేశాంగ విధానం.

Continue Reading

Magazine Stories

సోషల్ మీడియా హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా?

Published

on

◆ సోషల్ మీడియా.. హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?
కర్నూలు జిల్లా:
సోషల్ మీడియా.. ఓ వజ్రాయుధం. హద్దుల్లో ఉంటూ అవసరం మేరకు ఉపయోగిస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే గీత దాటితే వాతలు తప్పవు. ఇప్పుడు సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలు ఏపీ హడలెత్తిపోతోంది. పోస్టుల్లో మాటలు హద్దులు దాటి పత్తా లేకుండా పోయిన వారు ఎందరు? సోషల్ మీడియా యూజర్లకు మోగుతున్న వార్నింగ్ బెల్స్ ఏంటి? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఇప్పటికైనా తెలుసుకోవాల్సిందేనా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?

ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఫిర్యాదు చేస్తున్న జనసేన నాయకులు

సోషల్ మీడియా అంటేనే ఏపీలో చాలామందికి వెన్నులో వణుకు పుడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయిన క్షణం నుంచి ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు కనిపిస్తోంది. వాళ్లు వీళ్లు అని కాదు.. హద్దులు దాటి చెత్త రాతలు రాసిన ఎవరినీ పోలీసులు వదలడం లేదు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కూడా ఈ రచ్చ అంటుకుంది. ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లిన ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు అందించారు.

ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియా యాక్టివిస్టుల పై ఫిర్యాదు చేస్తున్న ఫోటో

అంతెందుకు ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నరసరావుపేట కు చెందిన సుధారాణిపై, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళి వంటి వారిపైనా కేసులు బుక్ చేశారు పోలీసులు.  అదే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అనంతపురం జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన జె. రామాంజనేయులు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసు నమోదు చేశారు.
ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులతో పాటు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ ట్విట్టర్ లో పోస్టు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తుళ్లూరులోనూ మరో కేసు ఫైల్ అయ్యింది. దీంతో విచారణకు రావాలని పోలీసులు నోటీసులిచ్చారు. పోస్టు ఎప్పుడు పెట్టారన్నది కాదు.. తప్పుగా పెట్టారా లేదా అన్నట్లుగా వెతికి పట్టుకుంటున్నారు పోలీసులు. వర్మకు జస్ట్ నోటీసులు మాత్రమే. సోషల్ మీడియాలో హద్దులు దాటిన చాలామంది ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.

సోషల్ మీడియా బ్యానర్

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. అది అసభ్యకర పోస్టులే. సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టులు పెట్టే వారిపై ఏపీ పోలీసులు వారం రోజులుగా చర్యలు తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తూ అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరికొందరికి విచారణ నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే, ఇందులో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ లపైనా కేసులు నమోదయ్యాయి.

యాక్టర్స్ బ్యానర్ ఫోటో

డైరెక్టర్ ఆర్జీవీ, పోసాని కృష్ణమురళి వంటి వారిపైనా కేసులు బుక్ చేశారు పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని కోర్టులో ఓ పిల్ వేయగా..హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో తప్పేముందని ప్రశ్నించడమే కాదు.. కేసులు పెట్టొద్దని పోలీసులను ఆదేశించలేము అని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా పైశాచికత్వం ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలే నిదర్శనం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

చేసే ప్రతి పోస్టు, రాసే ప్రతి మాటను గమనించే త్రినేత్రం ఒకటి ఉంటుంది. సోషల్ మీడియా యూజర్లు ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. హద్దుల్లో లేకపోతే ప్రమాదంలోకి అడుగు పెట్టినట్లే. విమర్శలు చేయడంలో తప్పు లేదు. హద్దులు దాటి ఓవరాక్షన్ చేస్తేనే అసలు సమస్య. ఇంతకీ సోషల్ మీడియా ఘోరాలపై ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఆ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం నాశనమేనా?

Continue Reading

Magazine Stories

మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనుడు

Published

on

★ సాధారణంగా విజయం సాధించిన వారు చరిత్ర సృష్టిస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం ఓడిపోయి రికార్డు సృష్టించాడు. 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది.

★ సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న నా ప్రయత్నం.. తమిళనాడుకు చెందిన పద్మరాజన్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చూపిస్తున్న పద్మరాజన్

తమిళనాడుకు చెందిన పద్మరాజన్ ఒక టైర్ పంచర్ రిపేర్ షాప్ ఓనర్ ఇతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ అన్ని సార్లు ఓడిపోయాడు. 1988 నుండి ఇప్పటివరకు లోకల్ ఎలక్షన్స్ నుండి లోక్సభ ఎలక్షన్స్ వరకు చివరికి ప్రెసిడెన్సీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశాడు. అలా ఈయన 6 ప్రెసిడెన్షియల్ 6 వైస్ ప్రెసిడెన్షియల్ 32 లోక్సభ 50 రాజ్యసభ 73 పార్లమెంటరీ ఎలక్షన్స్ లలో పోటీ చేశాడు.

పద్మ రాజ్యం నామినేషన్ వేస్తున్న దాచిన ఫోటో

ఇతను  వాజ్పేయ్, పివి నరసింహారావు, జయలలిత, కరుణానిధి, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రాహుల్ గాంధీ, విజయకాంత్, మోదీ ఇలా ఎంతో మంది ప్రముఖుల మీద పోటీ చేశాడు. అయితే ఎలక్షన్స్ లో నామినేషన్స్ వేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ గా కొంత అమౌంట్ పే చేయలి ఆ నగదును తన టైర్ పంచర్ రిపేర్ షాప్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఎలక్షన్ నామినేషన్స్ కోసం సెక్యూరిటీ డిపాజిట్లు సుమారుగా 80 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందట.

పద్మరాజన్ కు వచ్చిన అవార్డు

ఇన్ని ఎలక్షన్స్ లో పాల్గొన్నా కానీ ఒక్కసారి కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేయలేదు నామినేషన్స్ వేసిన ప్రతిసారి ఓడిపోవాలని కోరుకుంటారట మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి ఇతను ఇలా పోటీ చేస్తున్నాడట ఓడిపోతున్నా సరే పట్టించుకోకుండా ఇన్ని ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ కాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది.

పద్మ రాజన్ షాప్ లో ఫోజ్ ఇచ్చిన ఫోటో
పద్మ రాజన్ షాప్ లో ఫోజ్ ఇచ్చిన ఫోటో
Continue Reading
News2 weeks ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News2 weeks ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 weeks ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News1 month ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News1 month ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News2 months ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News2 months ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News3 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

News3 months ago

హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్

News3 months ago

ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!

Trending