కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కర్నూలు లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ ఎస్. ఏం. డి. గౌస్ సోమవారం 24 వ తేదీ న పత్తి వ్యాపారుల కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు వరుసగా కోడుమూరు మండలం వర్కూరు గ్రామం లో హెచ్. హనుమంతు, ఎమ్మిగనూరు ప్రాంతంలోని షేక్షావల్లి కాటన్, ఈరన్న ఫుడ్ గ్రెయిన్స్, గౌస్ కాటన్ ట్రేడర్స్, గిడయ్య కాటన్, ఆశా ట్రేడర్స్, HKGN కాటన్ మర్చెంట్, శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ (కర్నూల్ రోడ్, ఎమ్మిగనూరు) లో జరిగినవి. ఈ తనిఖీలలో పలువురు వ్యాపారులు వినియోగిస్తున్న తూకపు యంత్రాలకు రీస్టాంపింగ్ గడువు పూర్తయ్యినట్టు గుర్తించడమే కాకుండా, 10 కేజీల తుకనికి 1,200 గ్రాములు తక్కువగా చూపిన ఘటనలు నమోదైనవి. ఈ నేపథ్యంలో లీగల్ మెట్రాలజీ చట్టం, 2009 సెక్షన్ 8/25 మరియు 30 ప్రకారం 2 కేసులు నమోదు చేసి, రూ. 35,000 జరిమానా విధించారు. రైతులకు కాటన్ కొనుగోలు తూకా విధానంపై అవగాహన కల్పించారు.

అదేవిధంగా ప్రతీ వ్యాపారుడు తాను వాడుతున్న తూకపు యంత్రాలను లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా సరిచూసుకుని, వెరిఫికేషన్ సర్టిఫికేట్ వ్యాపారం వద్ద ప్రదర్శించాల్సిన అవసరం ఉందని సూచించారు. లీగల్ మెట్రాలజీ శాఖ ముద్ర సర్టిఫికేట్ లేని యంత్రాలు వాడితే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు, రైతులు తూకపు యంత్రాలపై శాఖ ముద్ర ఉందా అని చూసుకోవాలని తెలిపారు. వరుసగా తనిఖీలు కొనసాగిస్తామని లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్, ఇన్స్పెక్టర్ ఎస్ ఎం డి గౌస్ తెలియజేశారు.
