అమరావతి : విశాఖలో చేనేత ప్రోత్సాహానికి బీచ్ వద్ద శారీ వాక్ నిర్వహించారు మహిళలు. ఈ శారీ వాక్‍లో 8 వేల మంది మహిళలు, విశాఖ యువతులు పాల్గొన్నారు. “ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ” ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో శారీ వాక్ చేశారు. శారీ వాక్‍లో ముఖ్యఅతిథిగా హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ చేనేత కార్మికులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారుఅని ఆవేదన వ్యక్తంచేశారు. నేతన్నల బతుకుల్లో వెలుగు నింపడానికి ప్రభుత్వం కృషిచేస్తోందని భరోసా ఇచ్చారు.