నంద్యాల జిల్లా మసీదుపురం మెట్ట వద్ద ఉన్న వెంచర్లో దారుణ హత్యజరిగింది. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో మెయిన్ ముద్దాయి అయిన కవ్వా సాయిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కవ్వ సాయి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నికిల్ హత్యాయత్నం కేసులో కూడా ముద్దాయిగా ఉన్నడు. పాత గొడవల కారణంగా కవ్వా సాయిని హత్య చేసి ఉంటారని స్థానికులు అనుకుంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని నమూనాలు సేకరిస్తున్న క్లూస్ టీం అధికారులు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.