కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద హరివాణం గ్రామ రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అర్హులైన 650 మంది రైతులకు ఖరీఫ్ పంట నష్ట పరిహారం అందలేదని ఆందోళన చేశారు. వెంటనే రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కి వినతి పత్రం అందజేశారు.


అగ్రికల్చరల్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపిన వివరాల మేర కు అకౌంట్ నెంబర్లు కొట్టే సమయంలో ఒక నెంబర్ అటు ఇటు కావడంతో మిస్ అయ్యాయని అన్ని సరిచేసి పంపించమని ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందుతుందని తెలిపారు. అయితే పెద్ద హరివరం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ 22 అకౌంట్లలో చేతివాటం ప్రదర్శించినట్లు తేలిందని అందులో 8 అకౌంట్లు రికవర్ చేశామని మిగిలిన 7 అకౌంట్లు త్వరలో రికవర్ చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *